- పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21
ఎంసి ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన జిల్లా కలెక్టర్ సత్య శారద , హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న,తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి,సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్,ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ , సీఎం వో కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. చోంగ్దు , మున్సిపల్ శాఖ సెక్రటరీ టి.కె శ్రీదేవి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
● వరంగల్ నూతన ఎంజీఎం హాస్పిటల్ భవనం నిర్మాణం పైన పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి..
● గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేస్తున్నా ఎందుకు పనులు వేగం గా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం..
● వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలి..
●వర్క్ షెడ్యూల్ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలి..
●సిఎంఓ అధికారులు నిరంతరం గ్రౌండ్ కి వెళ్లి
సమీక్ష చేయాలి..
●ప్రత్యేక అధికారులను నియమించి పనులను పర్యవేక్షణ చేయాలి..
●ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలి..
●ఇక నుంచి ప్రతి రోజు కలెక్టర్ ఆస్పత్రి పనులను పర్యవేక్షించాలి..శాఖల మధ్య సమన్వయం తో పని చేయాలి..
●కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలి..
●త్వరలో ఓపి సేవలు అందుబాటులోకి తీసుకురావాలి..హాస్పిటల్ చుట్టూ మంచి వాతావరణం ఉండేలా పరిసరాల్ని తీర్చి దిద్దాలి..
●సనత్ నగర్ టిమ్స్ తరహా లో ఓపి సేవలు వరంగల్ లో అందుబాటులోకి తీసుకురావాలి ..సనత్ నగర్ టిమ్స్ లో స్టాప్ క్వాటర్స్ ఏర్పాటు చేయాలి..
●తక్షణమే స్టాప్ క్వాటర్స్ పనులు ప్రారంభం కావాలి..
●హాస్పిటల్ మెయింటెన్స్ ను ఏజెన్సీ కి అప్పగించాలి.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు..




