Friday, September 11, 2026
Home Business రంజాన్ సందర్భంగా ఎమ్మెస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ మతీన్ ఆధ్వర్యంలో సేమియా పంపిణీ

రంజాన్ సందర్భంగా ఎమ్మెస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ మతీన్ ఆధ్వర్యంలో సేమియా పంపిణీ

0
47
IMG-20260321-WA0636

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. చుంచుపల్లి బైపాస్ రోడ్డులో ఎంఎస్ పాన్ మహల్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త, యువ కాంగ్రెస్ నాయకుడు మరియు ఎంఎస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ మతిన్ ప్రజలకు సేమియాను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌హెచ్ రవి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించి, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని సేమియాను స్వీకరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.