Friday, September 11, 2026
Home Family మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ (CHIDH.COM)

మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ (CHIDH.COM)

0
44
Videoshot_20260303_231331

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం..ప్రగతి నగర్
శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయములో కోటి కుంకుమార్చన యాగ మహోత్సవం..

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ (CHIDH.COM)
ద్వారా పేర్లు గోత్రములు రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి దత్తాత్రేయ శర్మ..తెలిపారు.కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం (శివాలయం)లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కోటి కుంకుమార్చన మహాయాగ మహోత్సవాన్ని నిర్వహించ సంకల్పించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా మార్చి 19,2026 నుండి మార్చి 28 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్థం సకల ప్రజలకు సౌభాగ్య ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలు కలగాలని సంకల్పంతో పంచాయతన సహితంగా కోటికుంకుమార్చన మహాయాగమును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

భక్తులు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ,పూజించి, సేవించి జగదాంబ అనుగ్రహానికి పాత్రులై
సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద ఐశ్వర్యాలు పొందగలరని కోరారు.

రుణ బాధలు, రోగ బాధలు, దాంపత్య సమస్యలు.. ప్రధానమైనటువంటి సమస్యల నివారణ కోసం,

పరాభవనామ సంవత్సరములో ప్రజలకు శుభములు లాభములు ఆనందములు సౌభాగ్యములు ఐశ్వర్యములు ఆరోగ్యములు కలగాలని సంకల్పంతో ఈ మహా యాగాన్ని నిర్వహించ సంకల్పించడం జరిగిందన్నారు.

భక్తులందరూ కూడా విశేష దేవతా హోమములలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు..

పది రోజులు నిర్వహించేటటువంటి కోటి కుంకుమార్చనలో పాల్గొన ధరించిన భక్తులు

చిద్ డాట్ కామ్.. యాప్ ద్వారా గానీ, వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పూజ హోమముల వివరమలకై 7330701939,
7032117114 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.