Saturday, September 12, 2026
Home Politics రామదన్ మాసానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం – ముఫ్తీ అబ్దుల్ మతీన్

రామదన్ మాసానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం – ముఫ్తీ అబ్దుల్ మతీన్

0
28
IMG-20260215-WA0159

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రామవరం జమ మస్జీద్ లో మసీదు కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఫ్తీ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసాల ద్వారా మనిషిలోని చెడు లక్షణాలను తొలగించి మానవతా విలువలను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. కల్మషం, కపటం, స్వార్థాన్ని విడిచి నిండు హృదయంతో రంజాన్‌ను ఆహ్వానించాలని కోరారు.
మౌలానా ఇర్ఫాన్ కూడా మాట్లాడుతూ ఈ మాసం ఆధ్యాత్మిక శుద్ధికి మార్గదర్శకమని చెప్పారు. షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మానవాళికి మార్గనిర్దేశం చేసే ఖురాన్ అవతరణ జరిగిన మాసమిదని, దాని బోధనలను అనుసరిస్తూ సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మసీదు అధ్యక్షుడు ఖమర్, కార్యదర్శి గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.