Saturday, September 12, 2026
Home Politics కొత్తగూడెంలో ఆర్‌ఎల్‌డీ సమావేశం – ఫుట్‌బాల్ గుర్తుకే ఓటు వేయాలని నేతల విజ్ఞ

కొత్తగూడెంలో ఆర్‌ఎల్‌డీ సమావేశం – ఫుట్‌బాల్ గుర్తుకే ఓటు వేయాలని నేతల విజ్ఞ

0
46
IMG-20260206-WA0736

📰 Generate e-Paper Clip

పాల్గొన్న ఎక్స్ ఎమ్మెల్సీ ఆర్ ఎల్ డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం లో రాష్ట్రీయ లోక్ దళ్ కార్యాలయం లో, దిలీప్ కుమార్ కపిలవాయి ఎక్స్ ఎంఎల్సీ & రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, కట్టా సతీష్ జిల్లా అధ్యక్షులు ఇతర రాష్ట్రీయ లోక్ దళ్ నేతలు స్థానిక చుంచుపల్లి లో గల ఆర్ఎల్డీ పార్టీలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ 15 స్థానాలలో స్థానిక సంస్థలలో పోటీ చేస్తోందని, ఆర్.ఎల్.డీ కి ఎన్నికల చిహ్నంగా ఫుట్బాల్ కేటాయించబడిందని తెలిపారు. ముఖ్యంగా కొత్తగూడెంలో ముగ్గురు అభ్యర్థులు బరి లో ఉన్నారు అని ఇక్కడి ప్రజలు ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి ఆర్.ఎల్.డి అభ్యర్ధులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో బి ఆర్ ఎస్ను మించి పోయిందని, శ్రీ రేవంత్ రెడ్డి లాంటి అసమర్ధ ముఖ్యమంత్రిని తన సుదీర్ఘ అధికార మరియు రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వం దెగ్గర సక్షేమ పథకాలకు ఒక్క రూపాయి లేదని వచ్చే డబ్బు అంత స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వానిదే అని ఈ స్థానిక ఎన్నికలలో ప్రజలు రేవంత్ రెడ్డి అహంకారంపై దెబ్బకొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. సింగరేణి సంస్థను మూసి వేయాలని తద్వారా పర్యావరణం అడవులు వన్య ప్రాణులు కాపాడబడతాయని లేకపోతే కొత్తగూడెం మణుగూరు భద్రాచలం రాజస్థాన్ ఎడారి లాగా మారతాయి అని అన్నారు. సంస్థను నడపదలుచుకుంటే 51% వాటా సింగరేణి కార్మికులకు ఇవ్వాలని మిగిలిన 49% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ఆర్ ఎల్డీ ఉపాధ్యకులు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ తరువాత కాంగ్రెస్ హయాంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని, కొత్తగూడెం మణుగూరు భద్రాచలం లాంటి ట్రైబల్ ఏరియా లో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయింపులు లేవని, బొగ్గు వాటాల పంచాయితీలతో మంత్రులు బహిరంగంగా తన్నుకుంటున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ ఎల్డీ యువత అధ్యకుడు రాజ్ కుమార్ రెడ్డి, మీడియా , మీడియా కోఆర్డినేటర్ గౌర బీరప్ప, ఆర్ ఎల్డీ రాష్ట్ర ట్రెజరర్ గిరి కుండే, కట్టా సతీష్ ,ఆర్ ఎల్డీ జిల్లా అధ్యక్షులు, ప్రసాద్ యాగంపూడి స్టేట్ జనరల్ సెక్రటరీ, కొత్తగూడెం ఆర్ ఎల్ డి పార్టీ కార్యదర్శి మూడు వీరన్న తదితరులు పాల్గొన్నారు.
మరియు సందర్భంగా మాట్లాడుతూ స్థానిక కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆర్ఎల్డీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈసంపల్లి మౌనిక 56 వ వార్డు మరియు పింజారా బ్రహ్మానందరావు 42వ వార్డు లో ఆర్ ఎల్ డి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఫుట్బాల్ గుర్తుని కేటాయించడం జరిగిందని స్థానిక కొత్తగూడెం ప్రజలు ఈ రెండు డివిజన్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సమావేశంలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.