Sunday, September 13, 2026
Home Politics కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

0
49
IMG-20260128-WA0081

📰 Generate e-Paper Clip


కాంగ్రెస్ మద్దతుతో 21,31 డివిజన్లలో సిపిఎం పోటీ

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ జరుగుతున్న ఎన్నికల్లో సిపిఎం రెండు డివిజన్లలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రశ్నించే గొంతుకులను పాలకమండలిలో ఉంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా వాటి పరిష్కారానికి మరింత పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజా ప్రతినిధుల సభలలో ప్రజల వాణిని వినిపించడానికి అవకాశం వచ్చిన ఈ సందర్భంలో సిపిఎం అభ్యర్థులను గెలిపించి ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతుకులను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలు వాటికి అవసరమైన పరిష్కారం మార్గాల పట్ల సిపిఎంకు స్పష్టమైన అవగాహన ఉందని భవిష్యత్తులో ఆ అవగాహనతో ప్రజా సమస్యలను పాలకమండలిలో వినిపిస్తామని అందుకు ప్రజలు సిపిఎం కు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ఏజే రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ కున్సోత్ ధర్మ జిలకర పద్మ వీర్ల రమేష్ భూక్యా రమేష్ పాల్వంచ టౌన్ కార్యదర్శి తులసీరామ్ నాయకులు కే సత్య జునుమాల నగేష్ గండమాల భాస్కర్ బచ్చలకూర శ్రీను గూని నాగచందర్ ఆలేటి శ్రీను నిరంజన్ మాధవి కుమారి నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.