Saturday, September 12, 2026
Home People మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయం

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయం

0
15

📰 Generate e-Paper Clip

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయంఅదనపు కలెక్టర్ నగేష్

మెదక్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) అబుల్‌ కలాం ఆజాద్‌137 జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం  మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి

బాటలు వేసిన మొదటి దేశ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.

జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్పి సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని చెప్పారు. కేంద్ర విద్యాశాఖా మంత్రిగా పని చేసి విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకవచ్చారని అన్నారు 

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Click here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.