Sunday, September 13, 2026
Home People మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

0
20

📰 Generate e-Paper Clip

                 మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

                ఘనంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా..

వరంగల్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటి వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.వారి జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి జడ్పీ సీఈవో మరియు డిఆర్డిఏ ఇన్చార్జి పి డి రామ్ రెడ్డి తో పాటు వివిధ జిల్లా అధికారులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడమైనది.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారత దేశ మొదటి విద్యా శాఖా మంత్రిగా పని చేశారు. వారు మక్కా లో జన్మించారని 

వారి జన్మస్థలం మక్కా లో జన్మించడం లోనే వారు మహోన్నతమైన వ్యక్తి గా కీర్తింపబడ్డారని ఈ సందర్భంగా వారిని కొనియాడారు.ఆయన చేసిన సేవలకు భారత రత్న ఆవార్డును గ్రహీతగా పేరుగాంచి ఉండని, అతని సేవలను గుర్తించి భారతదేశ చరిత్రలో తన జ్ఞానం, కార్యాచరణ, విశ్వాసం, సంకల్పం మరియు త్యాగంతో ఒక ప్రకాశవంతమైన అధ్యాయాన్ని లిఖించిన వ్యక్తి గురించి ఈ రోజు మీ ముందు చర్చించడం నాకు గౌరవంగా ఉందని తెలియ చేసారు. అలాగే 

మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ జీవితాన్ని అందరు అతని ఆశయాలను ఆదర్శంగా తెసుకోవాలని మరియు అమలు చేయాలని తెలియపరుచారు.
ఆయన విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవడానికి కృషి చేశారు. ఆయన నాయకత్వంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) వంటి ప్రముఖ విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి అని తెలియజేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి మాట్లాడుతూ వారు భారత దేశ అభివృద్ధికి వెలలేని సేవ చేశారని వారి సేవలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి 17 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు నిర్బంధ విద్య చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా

 జెడ్పి సీఈవో రామిరెడ్డి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కులమతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా తన ఆలోచనలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లి విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండేలా సంస్కరణ తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి గ్రామాల నా అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సంస్కరణలు మనం ఈరోజు అనుభవిస్తున్నామని ఒకప్పుడు పలక బలపం పట్టి చదివిన ప్రతి విద్యార్థిని విద్యవంతులుగా చూడగలిగా కానీ ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్మెంట్ డి

జిటల్ డాష్ బోర్డుపై విద్యాభజన చేయుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఒ నీరజ, డిబిసిడిఓ పుష్పలత, జెడి హార్టికల్చర్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో విశ్వప్రసాద్, మరియు సంబంధిత జిల్లా అధికారులు కలెక్టర్ వి ఉద సెక్షన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.