Friday, September 11, 2026
Home People కోండాపూర్‌లో విషాదం…నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి కింద పడిన కార్మికులు

కోండాపూర్‌లో విషాదం…నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి కింద పడిన కార్మికులు

0
40

📰 Generate e-Paper Clip

కోండాపూర్‌లో విషాదం…నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి కింద పడిన కార్మికులు

ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

అక్రమ నిర్మాణం అజాగ్రత్త నిర్లక్ష్యం వహించడం వల్లే అమాయకుడి ప్రాణాలు బలి అంటున్న స్థానికులు

శేరిలింగంపల్లి సర్కిల్ 20 వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యానికి అక్రమ నిర్మాణ దారుల ధన దాహానికి బలవుతున్న అమాయకులు

శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 15  గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కోండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదం వల్ల ఇద్దరు కార్మికుల కుటుంబాలను చీకటిలోకి నెట్టింది. సుమారు మూడు గంటల సమయంలో నాల్గవ అంతస్తులో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు గోవ కర్రలను కడుతున్న సమయంలో ఒక్కసారిగా కర్రలు విరగడంతో వారు నాలుగవ అంతస్తునుండి కిందకు పడిపోయారు. అయితే వెంటనే స్థానికంగా ఉండేవారు వీరిని గమనించి వెంటనే స్థానిక కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు చంద్రకుమార్( 32)మృతి చెందాడు. మరో కార్మికుడు విక్కీ (27) ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే దీనంతటికీ జీహెచ్ఏంసి అధికారులు మరియు భవన యజమానే కారణమని స్థానికంగా ఆరోపిస్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు ప్రమాణాలు పాటించకుండా భవన యజమాని భవన నిర్మాణ పనులు కొనసాగించడం వల్ల ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపిస్తున్నారు అంతే కాకుండా శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధి వ్యాప్తంగా ఇలాంటి ఎన్నో అక్రమనిర్మాణాలూ కొనసాగుతున్నాయని పూర్తిగా అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని ఏ ఒక్క నిర్మాణదారుడు కార్మికుల విషయంలో కనీస ప్రమాణాలు జాగ్రత్తలు పాటించకుండా కుటుంబ పొట్ట కూటికోసం నగరానికి వలస వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణగా అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు

భవన యజమాని నిర్లక్ష్యం వల్లే తన అన్న చంద్రకుమార్ మృతి

చత్తీస్‌ఘడ్ కు చెందిన చంద్రకుమార్ దినసరి కూలిగా హైదరాబాదుకు వచ్చాడు. ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన చంద్రకుమార్ కుటుంబపోషణకై కూలి పనులు చేస్తున్నాడు. కానీ ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో చంద్ర కుమార్ మరణంతో అ కుటుంబ భవిష్యత్తు ను కటిక చీకటిలోకి నెట్టింది. మృతుడు చంద్ర కుమార్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం భవన యజమాని ఎటువంటి జాగ్రత్తలు ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం చెయ్యటం వల్లే తన అన్న మృతి చెందాడని, ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరారు.

ఐసీయూలో కోన ఊపిరితో పోరాటం చేస్తున్న సోమని విక్కీ

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు విక్కీ పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనికి రెండేళ్ల చిన్నబాబు పదిహేను రోజుల బిడ్డ ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదం వల్ల విక్కీ కుటుంబం తీవ్ర భావోద్వేగంతో షాక్ కు గురైంది కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని విక్కీ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు ,

అనుమతులకతితంగ నిర్మాణాలు… పట్టణ ప్రణాళిక అధికారులు ఎక్కడ?

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి మూడు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, భవన యజమాని ఏకంగా ఐదు అంతస్తులు నిర్మిస్తుండటం తీవ్ర ప్రశ్నార్ధకమని పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు నిద్రలో ఉన్నారా? తీసుకున్న అనుమతికి విరుద్ధంగా నిర్మాణం ఎలా సాగుతోంది? పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

లేబర్‌ కమిషనర్ పర్యవేక్షణ లోపం, భవన నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల పాటించకపోవడం, కార్మికుల కోసం నిర్లక్ష్యంగా పనిచేయడం వంటి కారణాల వల్లే ఇలాంటి ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు

కేసు నమోదు… చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రమాదంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భవన యజమాని నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపినట్టు సమాచారం.ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చంద్రకుమార్ కుటుంబానికి, ఐసియూలో ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్న విక్కీ కుటుంబానికి అధికారుల సహాయం అత్యవసరం. నిర్మాణాల్లో కార్మికుల భద్రతను కేవలం పేపర్‌పైన కాక, అమల్లోనూ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.