Friday, September 11, 2026
Home Uncategorized మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి..

మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి..

0
13

📰 Generate e-Paper Clip

మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి..

పాల్వంచ మీడియా సంఘం పిలుపు

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

 పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాస్  అక్టోబర్ 23 : పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు గుంట్రూ వేణు, సెక్రటరీ కుమ్మరి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా పాల్వంచ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో చేరిన కొత్త సభ్యులకు పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు, దిశ దినపత్రిక విలేకరి జవ్వాజి మధు చేతుల మీదుగా కొత్త సభ్యులకు సభ్యత్వ ధృవపత్రాలు అందజేశారు.అనంతరం కొత్త సభ్యులను సంఘంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ మీడియా సమాజంలో నాలుగో స్థంభంగా నిలుస్తుంది. అయితే కొందరు దుర్వినియోగం చేస్తున్న వ్యక్తుల కారణంగా నిజాయితీతో పనిచేస్తున్న విలేకరులు అపఖ్యాతి చెందుతున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండి మీడియా విశ్వసనీయతను కాపాడాలి అన్నారు.సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ —మనందరం ఒకే వేదికపై ఐక్యంగా ఉండి అన్యాయాలపై ప్రశ్నించే గొంతుకలుగా మారాలి. మీడియా ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే శక్తిగా ఉండాలి అన్నారు.సభ్యత్వం పొందిన వారు కొండ్రు శ్రీనివాస్ (మనం దినపత్రిక), మేకల జ్యోతి (V5 న్యూస్), శివరాం చౌహాన్ (ప్రజాజ్యోతి), జయంత్ (టీవీ 999), జి.అఖిల్ (తెలంగాణ చౌరస్తా), జీవన్ (ఉదయం దినపత్రిక) సభ్యత్వాలు పొందారు.ఈకార్య క్రమం లో మీడియా సంఘ సభ్యులు,గడ్డం నరహరి ,వెలదండి దుర్గాప్రసాద్,నునావత్ ప్రసాద్,పార్థసారథి,జీ .శివకృష్ణ, ఎస్ కే జానీ, చౌహాన్,పి రవికుమార్, సొల్లు పుల్లారావు, వజ్జా వాసు స్థానిక పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.