Friday, September 11, 2026
Home Uncategorized గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు

గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు

0
18

📰 Generate e-Paper Clip

గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు

(ఆవాజ్ న్యూస్12 అక్టోబర్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో ఈరోజు గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాత్ షరీఫ్ ప్రదర్శనతో పాటు ప్రవక్త మహమ్మద్ ﷺ గారి జీవన విధానం, సద్గుణాలు గురించి వివరించబడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

ఈ జల్సాకు ముఖ్య అతిథులుగా హజ్రత్ అల్లామా మౌలానా మునజిరుల్ ఖాద్రి, హజ్రత్ హాఫిజ్ వకార్ వసీం రజా, హజ్రత్ హాఫిజ్ వకారి మహబూబ్ (మార్కజీ నాయబ్ ఇమామ్), హజ్రత్ హాఫిజ్ వకార్ అఖీల్ అహ్మద్ తదితరులు విచ్చేసి ప్రార్థనలు నిర్వహించారు.

కార్యక్రమానికి మసీదు సదర్ ముస్తఫా సహాబ్, నాయబ్ సదర్ గౌస్ సహాబ్, క్యాషియర్ జాకీర్, ఇంజినీర్ అహ్మద్ వజీర్, షాదుల్ సహాబ్, అస్గర్ సహాబ్, ఈసా సహాబ్ మరియు మసీదు యువజన సభ్యులు ఎస్.కే. రహమత్ (రిపోర్టర్) సహా పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.