Friday, September 11, 2026
Home Uncategorized కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన పద్మ దేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన పద్మ దేవేందర్ రెడ్డి

0
12

📰 Generate e-Paper Clip

                 కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన పద్మ దేవేందర్ రెడ్డి 

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ పట్టణంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు
అనంతరం పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతు డిసెంబర్ 9 వరకు ఆరు హామీలను నెరవేరుస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు ఐతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడం మరిచిందన్నారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు 2000 పింఛన్ ఉన్న వారికి నాలుగు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చదువుకునే విద్యార్థినిలకు స్కూటీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇలా అబద్ధాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడంలో విఫలమైందన్నారు ఆరు గ్యారెంటీల కాడు ఎలా ఇచ్చి అధికారంలో వచ్చారొ అలాగనె నెరవేరని హామీల బాకీ కార్డు ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ జెడ్పిటిసిలు ఎంపీటీసీలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.