Wednesday, November 4, 2026
Home Politics —ఎర్రబెల్లి సోదరులతో కలిసి చిరు వ్యాపారులకు ఎగ్ కార్డులు పంపిణీ చేసిన :ఎంపీ రవిచంద్ర…

—ఎర్రబెల్లి సోదరులతో కలిసి చిరు వ్యాపారులకు ఎగ్ కార్డులు పంపిణీ చేసిన :ఎంపీ రవిచంద్ర…

0
87

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 3

కోడిగుడ్డు పుష్టికరమైన ఆహారమని,వీటి ద్వారా మన శరీరానికి అవసరమైన నాణ్యమైన ప్రోటీన్లు,విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఆయన సోదరుడు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ వరంగల్ జోనల్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుల ఆధ్వర్యాన వారి స్వగ్రామం పర్వతగిరిలోని నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 30 మంది చిరు వ్యాపారులకు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలకు,కండరాల పుష్టికి,శరీరానికి అవసరమైన శక్తి కోడిగుడ్ల ద్వారా లభిస్తుందని వివరించారు.తక్కువ ధరలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే కోడిగుడ్లను ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.ప్రజల ఆరోగ్యం, పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పిస్తూ లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా ఎగ్ కార్డుల పంపిణీ చేపట్టిన దయాకర్ రావు, ప్రదీప్ రావు,వారి కుటుంబ సభ్యులను ఎంపీ వద్దిరాజు అభినందించారు.ఈ సందర్భంగా వ్యాపారులకు స్టాల్,సిలిండర్,మూకుడు,గంటెలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.