Wednesday, November 4, 2026
Home Crime భూంపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరం పై పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్....

భూంపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరం పై పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్. పేకాటరాయులపై సదాశివనగర్ పోలీసుల ఉక్కు పాదం

0
149

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండల్ భూంపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేకంగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో 8 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు:1. నగదు – రూ.13,390/- 2. సెల్‌ఫోన్లు – 8 3. ద్విచక్ర వాహనాలు –6 అక్రమ జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని కుటుంబాలను రోడ్డున పడనియొద్దని. జూదం జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వ్యవస్థ యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దుఅని సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ సూచించారు. తమ పరిసరాల్లో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.