Wednesday, October 28, 2026
Home Politics State తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

0
37

📰 Generate e-Paper Clip

భారీ వర్షాల ముప్పు దృష్ట్యా అక్టోబర్ 28న సెలవు ప్రకటించిన కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27(పరివర్తన ఆవాజ్)

తుఫాన్ హెచ్చరికలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం (అక్టోబర్ 28) ఒకరోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మంగళవారం రాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ హెచ్చరికలు, బులెటిన్ల నేపథ్యంలో జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర విద్యా సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.విద్యార్థులు, విద్యా సిబ్బంది భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని సంబంధిత విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.