Monday, October 26, 2026
Home People ప్రజావాణిలో 153 అర్జీలు స్వీకరణ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ప్రజావాణిలో 153 అర్జీలు స్వీకరణ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక  వరంగల్, అక్టోబర్ 26:

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 153 అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 55, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 24, డీఆర్‌డీఏకు 8, హౌసింగ్ శాఖకు 11 అర్జీలు రాగా, ఇతర శాఖలకు సంబంధించి మరో 55 అర్జీలు అందాయి.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన సమస్యలతో పాటు వృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు. వృద్ధులకు సంబంధించిన అర్జీలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సంక్షేమ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడి పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మానవత్వంతో స్పందించారు. ఆ వృద్ధుడికి టీషర్ట్, జూట్ బ్యాగ్ అందించి తన ఆప్యాయతను చాటుకున్నారు. కలెక్టర్ చూపిన మానవత్వానికి వృద్ధుడు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో వృద్ధుడి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి అర్జీని ఎండార్స్ చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని, అధికారులు అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, జడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్ పీడీ విష్ణు వర్ధన్ రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజిరెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.