ప్రజావాణిలో 153 అర్జీలు స్వీకరణ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక  వరంగల్, అక్టోబర్ 26: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 153 అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 55, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 24, డీఆర్‌డీఏకు 8, హౌసింగ్ శాఖకు 11 అర్జీలు...