Monday, October 26, 2026
Home People —వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి…

—వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి…

0
2

📰 Generate e-Paper Clip

–వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

  వపరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ అక్టోబర్ 26:

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో వర్ధన్నపేట శాసనసభ్యులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మేర కార్పొరేషన్ చైర్మెన్ సంగ వెంకట రాజం, గ్రంథాల చైర్మెన్ మీసాల ప్రకాశ్ , అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పుష్పలత,కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొని వాల్మీకి చిత్ర పటానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

—వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని వర్ధన్నపేట శాసనసభ్యులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ… ఆదర్శప్రాయుడు రాబోయే తరానికి వారి జీవిత చరిత్రను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మంచి తరుణం అన్నారు.వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మానవ జీవితానికి మార్గదర్శకమని, అందులోని నీతి, ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు తెలియజేస్తూ, ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

–రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి జీవితం మనందరికీ ఆదర్శప్రాయుడు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి జీవితం మనందరికీ ఆదర్శప్రాయుడు అని పేర్కొన్నాడు.మహర్షి వాల్మీకి చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన బోధనలను మన జీవితాల్లో ఆచరించాలి. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. మహర్షి వాల్మీకి ఆశయాలను భావితరాలకు అందిస్తూ, సమానత్వం, సామాజిక ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలన్నారు.

వాల్మీకి మహర్షి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం: మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట రాజం…

వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచనలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని మేయర్ కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట రాజం అన్నారు. వాల్మీకి మహర్షి చూపిన మార్గంలో నడుస్తూ, సమాజంలో సద్గుణాలు, నైతిక విలువలు, సమానత్వ భావనను పెంపొందించుకోవాలని సూచించారు.రామాయణంలోని విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్*వాల్మీకి మహర్షి రచించిన రామాయణం తరతరాలకు మార్గదర్శకమని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ అన్నారు.మహనీయుల జీవిత చరిత్రలు, రచనలను చదవడం ద్వారా యువతలో మంచి ఆలోచనలు, నైతిక విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు.ఈ జయంతి వేడుకలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.