Friday, October 23, 2026
Home People –ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…. —వివిధ శాఖల...

–ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…. —వివిధ శాఖల ముందస్తు జాగ్రత్త చర్యలు, ప్రణాళికలపై సమీక్ష…..

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 22:

వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండల వ్యవసాయ శాఖ,ఎలక్ట్రిసిటీ,ఆర్ డబ్యూ ఎస్,గ్రౌండ్ వాటర్, తదితర క్షేత్ర స్థాయి అధికారుతో ఎల్‌నినో ప్రభావాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, రూపొందించాల్సిన ప్రణాళికలపై చర్చించారు.వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నీటి వృథా ను అరికట్టాలి, కరెంట్ ఆదా చేయాలి, వ్యవసాయ ఉద్యాన పంటలు విషయంలో ఆరు తడి పంటలు డ్రిప్ ఇరిగేషన్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు త్రాగునీటి కి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, డియార్వో విజయలక్ష్మి వరంగల్ ఆర్డీవో సుమ నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ ఆర్ డబ్యూ ఎస్ ఇ ఇ నిర్మల, సంబధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.