Friday, October 23, 2026
Home Politics –కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సారయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  లక్ష రూపాయల ఆర్థిక సాయం….

–కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సారయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  లక్ష రూపాయల ఆర్థిక సాయం….

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 22

—దహన సంస్కారాలు, ఇతర ఖర్చుల నిమిత్తం తనవంతుగా ఆర్థిక సహాయం అందజేత….

మాజీ కార్పొరేటర్ తూర్పాటి సులోచన  భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సారయ్య  మృతి చెందిన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  వారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సారయ్య  దహన సంస్కారాలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  తనవంతుగా రూ.1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అంతేకాకుండా, ఈ ఖర్చులకు సంబంధించిన పూర్తి బాధ్యతలను అదే డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్‌కు అప్పగించారు. దహన సంస్కారాలు, ఇతర కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చూడాలని సూచించారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడిగా సేవలందించిన సారయ్య  మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సారయ్య  ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.