–కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సారయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లక్ష రూపాయల ఆర్థిక సాయం….
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 22 ---దహన సంస్కారాలు, ఇతర ఖర్చుల నిమిత్తం తనవంతుగా ఆర్థిక సహాయం అందజేత.... మాజీ కార్పొరేటర్ తూర్పాటి సులోచన భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సారయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సారయ్య దహన సంస్కారాలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తనవంతుగా రూ.1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని...