Friday, October 23, 2026
Home People -రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి…. —ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన...

-రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి…. —ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద….

0
8

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  ఆక్టోబర్ 22

జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీసర్వే, భూదాన్ భూములు, భూభారతి, నక్షా, రెవెన్యూ సదస్సులు, సాదాబైనామా, భూసేకరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి 163జీ, విమానాశ్రయం, ఎస్‌ఐఆర్ (SIR), ఎమ్మెల్సీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయా అంశాలకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,డియార్వో విజయలక్ష్మి వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి సంబంధిత మండలాల తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.