పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ఆక్టోబర్ 22
జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీసర్వే, భూదాన్ భూములు, భూభారతి, నక్షా, రెవెన్యూ సదస్సులు, సాదాబైనామా, భూసేకరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి 163జీ, విమానాశ్రయం, ఎస్‌ఐఆర్ (SIR), ఎమ్మెల్సీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయా అంశాలకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,డియార్వో విజయలక్ష్మి వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి సంబంధిత మండలాల తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.