Thursday, October 22, 2026
Home Politics -తెలంగాణ రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి……

-తెలంగాణ రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి……

0
17

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు రాష్ట్ర మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రకృతిని దైవంగా భావించి పూజించే అరుదైన సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని కొనియాడారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. దేవతలకు అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞత భావనను తెలియజేస్తుందని తెలిపారు. సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని వెల్లడించారు. ప్రకృతితో మమేకమై తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ ఆడబిడ్డల ఆటపాటలతో పల్లెలు, పట్టణాలు సాంస్కృతిక శోభను సంతరించుకున్నాయని అన్నారు.ఈ సందర్బంగా విజయాలను అందించే విజయ దశమి(దసరా)ని స్వాగతిస్తూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతోపాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని జగన్మాత గౌరీదేవిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.