-తెలంగాణ రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి……

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18 తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు రాష్ట్ర మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రకృతిని దైవంగా భావించి పూజించే అరుదైన సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని కొనియాడారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని అన్నారు. దేవతలకు...