Thursday, October 22, 2026
Home Politics దసరా నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించాలి: సీఎం ఆదేశాలు నాయిని రాజేందర్...

దసరా నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించాలి: సీఎం ఆదేశాలు నాయిని రాజేందర్ రెడ్డి….

0
9

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 16

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి  సీతక్క, రాజ్యసభ సభ్యులు  వేం నరేందర్ రెడ్డి  తో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  మాట్లాడుతూ,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు దసరా నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించేందుకు మొదటి దశ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి రోజుకు 3,000 మంది రోగులకు ఓపీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు  బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు  కేఆర్ నాగరాజు,  రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు శ్రీమతి చాహత్ బాజ్ పాయ్,  సత్య శారద, NPDCL సీఎండీ శ్రీ వరుణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.