పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16
హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవల్ స్కూల్ గేమ్స్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్–2026ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , క్రీడా ప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.




