పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 6
కేసముద్రం, అక్టోబర్ 06 ( ): మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ జన్మదిన వేడుకలను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ (సమ్మి గౌడ్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మురళీనాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ… ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి, వారికి అండగా నిలుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.సమ్మి గౌడ్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే మురళీనాయక్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం మరింత సేవ చేసే అవకాశం ఆయనకు కలగాలని కోరారు. ఎమ్మెల్యే గెలుపు కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పీసీసీ సభ్యులు దస్రు నాయక్, టౌన్ పార్టీ అధ్యక్షులు రావుల మురళీ,అల్లం నాగేశ్వర్ రావు,అంబటి మహేందర్ రెడ్డి,వీరేష్ యాదవ్,ఆయూబ్ ఖాన్,బండారు వెంకన్న,కదిరే సురేందర్, బండారు దయాకర్,దామరకొండ ప్రవీణ్,బానోత్ వెంకన్న, బట్టు శ్రీనివాస్, భద్యనాయక్, ప్రభురాని, దనమ్మ,మహేందర్ గౌడ్,సర్పంచ్ లు బాలాజీ రెడ్డి, వీరాస్వామి,సూరయ్య, సంతోష్ నాయక్,సుమన్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రామచంద్రు,నాయకులు సామల నర్సయ్య, పోలేపాక ఉప్పలయ్య,వోలం రాజు, చిదిరాల వసంత రావు, వోలం రాజు,రియాజ్ ఖాన్,మండలం లోని అన్ని గ్రామాల ఉపసర్పంచ్ లు,వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




