Thursday, October 22, 2026
Home Politics మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

0
22

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 04

వర్ధన్నపేట నియోజకవర్గంలోనీ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల కార్ల్ మార్క్స్ కాలనీకి చెందిన ఎలుకటి సులోచన మృతి చెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , సులోచన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  తెలిపారు. ఆయన వెంట డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, కాలనీ అధ్యక్షులు లింగస్వామి, కన్ని, వినయ్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.