పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02
పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరామర్శించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి బాధలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా అన్నారం గ్రామంలో అడ్వకేట్ గొడుగు నికేష్, పెద్దతండాలో ప్రమాదంలో మృతి చెందిన నునావత్ భద్రు-సరోజ, బుర్గుమల్ల గ్రామంలో లక్ష్మిచంద్ర, మంగ్త్య వాల్య తండాలో లకావత్ వెంకన్న, కల్లెడ గ్రామంలో బాలయ్య, గొరుగుట్ట తండా గ్రామంలో మూన్య మృతులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులర్పించారు.అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంది, అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాలు ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షురాలు సావిత్రి, సర్పంచ్ శంకర్, కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి PACS చైర్మెన్ అత్తి కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బానోత్ సింగులాల్, ఏనుమాముల మార్కెట్ డాక్టర్ గొడుగు బిక్షపతి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లు, మండల సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




