పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30…గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా అతి త్వరలోనే వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకువచ్చి రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేలేరు మండలానికి సంబందించిన 04గురు కల్యాణ లక్ష్మి -షాదీ ముబారక్ లబ్ధిదారులకు 4లక్షల 464రూపాయల విలువగల చెక్కులను అలాగే 09మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 3లక్షల 49వేల 500రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.అనంతరం ఇటీవల జరిగిన దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్న వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని తగిలిన గయాలను పరిశీలించారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధానంగా చూస్తామని అన్నారు. అధైర్య పడవద్దని ఎమ్మెల్యే గా నేను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పీచర గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటలక్ష్మి ఇటీవల మరణించగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ధర్మసాగర్ మండలం నారాయణగిరి చెందిన పింగిలి మణెమ్మ ఇటీవల మరణించగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పథకం అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. పేద వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు రెండో సంవత్సరం 2లక్షల 50వేల ఇల్లు మొత్తం 7లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన 8లక్షల కోట్ల అప్పుకు మిత్తిలు కడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 6గ్యారెంటీల అమలులో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని వెల్లడించారు. 7వేల 800కోట్ల రైతు భరోసా నిధులను 75లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా యాసంగి పంటలకు గండి రామారం లిఫ్ట్ -1పనులు పూర్తి చేసి వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకువచ్చి రైతులకు సాగు నీరు అందిస్తానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పంతో పని చేస్తున్నాన్ని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపిడివో వివిధ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




