Thursday, October 22, 2026
Home Politics స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం….* 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి...

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం….* 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎం చేశాడో ఒకసారి ఆలోచించాలి…. స్టేషన్ ఘనపూర్   ఎమ్మెల్యే కడియం శ్రీహరి  …

0
49

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్  తెలుగు దిన పత్రిక స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 29

10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.లింగాల ఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో 10లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించి 20లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత కొత్తపల్లి గ్రామంలో 37.50లక్షలతో నిర్మించిన పలు సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ... గత ప్రభుత్వం గాని, గత ఎమ్మెల్యే గాని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని గొప్పలు చెప్పి వనపర్తి గ్రామానికి గాని, కొత్తపల్లి గ్రామానికి గాని ఒక్క ఇల్లు ఆయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. గత ఎమ్మెల్యే ఏ రకంగా పని చేశాడు.. ప్రస్తుతం ఎమ్మెల్యే ఏ రకంగా పని చేస్తిన్నాడో ఒకసారి ఆలోచించాలని సూచించారు. నా 35ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరిదగ్గర ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, నిజాయితీగా పని చేయడం మాత్రమే నాకు తెలుసని అన్నారు. 24ఏళ్ల క్రితం నేను శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టు నేడు పూర్తి అయి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి సాగు నీరు అందించడం నాకు చాలా సంతృప్తినిస్తుందని వెల్లడించారు. దేవాడుల శంకుస్థాపన చేసిన నాడు పూర్తి అయి సాగు నీరు అందించేనాడు నేను ఎమ్మెల్యే ఉన్నానని, ఒక రాజకీయ నాయకునికి, ప్రజా ప్రతినిదికి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుందని అన్నారు. ఇప్పటికి దేవాదుల పేరు చెబితే కడియం శ్రీహరి గుర్తుకువస్తాడని తెలిపారు.లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నాదని తెలిపారు. వనపర్తి గ్రామానికి మొదటి సారి ఎమ్మెల్యే అయ్యానని, అయినా వనపర్తి గ్రామానికి నాకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. 25ఏళ్ల క్రితమే వనపర్తిలో పాల కేంద్రానికి భవనం మంజూరు చేసి నిర్మాణం చేయించినట్లు గుర్తుచేశారు. 3ఏళ్లలో ఒక్క వనపర్తి గ్రామ అభివృద్ధికి 2కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వనపర్తి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వనపర్తి గ్రామానికి సాగు నీరు, విద్యుత్ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, బిటీ రోడ్లు, సిసి రోడ్ల త్వరలోనే మంజూరు చేయించి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. లింగాల ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామాన్ని ఫైలెట్ గ్రామంగా ఎంపిక చేసి గ్రామంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తపల్లి గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటే అది కడియం శ్రీహరి వల్లనే అని స్పష్టం చేశారు. కొత్తపల్లి నుండి డిక్య తండా వరకు 85లక్షలతో రోడ్డు మంజూరు అయిందని, అలాగే కొత్తపల్లి నుండి లింగాల ఘనపూర్ వరకు హ్యామ్ పథకం కింద 9కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు అయిందని త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజా స్వామ్యం, పేద ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. పేద వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు రెండో సంవత్సరం 2లక్షల 50వేల ఇల్లు మొత్తం 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన 8లక్షల కోట్ల అప్పుకు మిత్తిలు కడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 6గ్యారెంటీల అమలులో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 2లక్షల 50వేల కొత్త పెన్షన్లు, రైతు భరోసా,ఋణ మాఫీ, సన్నాలకు బోనస్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో వనపర్తి, కొత్తపల్లి గ్రామాల సర్పంచులు వంచ శైలజ ఉపేందర్ రెడ్డి, గాదెపాక విష్ణు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గుడి వంశీధర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ శివ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ మనోహర్, వివిధ గ్రామాల సర్పంచులు, తహసీల్దార్, ఎంపిడివో, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.