Monday, October 26, 2026
Home People –(SIR)ఓటరు సమగ్ర సర్వే సవరణలో పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య...

–(SIR)ఓటరు సమగ్ర సర్వే సవరణలో పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద..

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్‌, అక్టోబర్‌ 26:

జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణను పూర్తి చేసి, పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.నోటీసులు అందుకున్న వారికి నిర్ణీత గడువులోగా విచారణ నిర్వహించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.జిల్లాలోని నర్సంపేట, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,94,399 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 1,94,395 నోటీసులు జనరేట్‌ అయ్యాయి. వీటిలో 1,92,703 నోటీసులు సంబంధిత వ్యక్తులకు అందజేయగా, మరో 1,692 నోటీసులు అందజేయాల్సి ఉంది. మొత్తం 1,92,775 విచారణలు పూర్తయ్యాయి. మరో 1,620 విచారణలకు సంబంధించిన తేదీలు గడువు దాటినట్లు నివేదికలో నమోదైంది.నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నర్సంపేటలో 51,880 నోటీసులు జనరేట్‌ కాగా, 51,878 నోటీసులు అందజేశారు. వరంగల్‌ తూర్పులో 75,753 నోటీసులు జనరేట్‌ కాగా, 74,061 నోటీసులు అందజేశారు. వర్ధన్నపేటలో 66,764 నోటీసులు జనరేట్‌ చేసి, అన్నింటినీ అందజేశారు.అధికారుల స్థాయిలో 29,166 కేసులు వెరిఫై కాగా, 11 కేసులు ఇంకా వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది. 2,178 కేసులు తుది పరిష్కారానికి అనర్హమైనవిగా గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు.నోటీసులపై విచారణ, ధ్రువీకరణ, తుది ప్రచురణకు సంబంధించిన ప్రక్రియలను నిర్దేశిత నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.