Monday, October 26, 2026
Home People —వరంగల్ జిల్లాలో 30,442 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

—వరంగల్ జిల్లాలో 30,442 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

0
9

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా అక్టోబర్ 26

జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా మొత్తం 30,442 దరఖాస్తులు అందాయి. వీటిలో 30,418 ఆన్‌లైన్ ద్వారా, 24 ఆఫ్‌లైన్ ద్వారా స్వీకరించారు. ఇప్పటివరకు 2,832 ఫారాలు ఆన్‌లైన్‌లో ఆమోదించగా, 170 ఫారాలు తిరస్కరణకు గురయ్యాయి. మరో 27,435 ఫారాలు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.అక్టోబరు 26 నాటి మండలాల వారిగా వరంగల్ మండలంలో అత్యధికంగా 6,590 దరఖాస్తులు అందాయి. ఖిలా వరంగల్‌లో 5,392, నర్సంపేటలో 3,199, గీసుగొండలో 2,362, సంగెంలో 2,208 దరఖాస్తులు నమోదయ్యాయి.నెక్కొండలో 1,620, రాయపర్తిలో 1,563, వర్ధన్నపేటలో 1,412, ఖానాపూర్‌లో 1,374, పర్వతగిరిలో 1,286, దుగ్గొండిలో 1,207, చెన్నారావుపేటలో 1,164, నల్లబెల్లిలో 1,065 దరఖాస్తులు అందాయి.

–బీఎల్ఓలకు 20,878 ఫారాల కేటాయింపు..

దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాలో 20,878 ఫారాలను బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓలు) కేటాయించడం జరిగిందని, నివేదిక ప్రకారం 3,752 ఫారాలు ప్రాసెస్ చేయాల్సి ఉండగా, ఏఈఆర్ఓ స్థాయిలో 434, ఈఆర్ఓ స్థాయిలో 2,371 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.