–(SIR)ఓటరు సమగ్ర సర్వే సవరణలో పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 26: జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణను పూర్తి చేసి, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.నోటీసులు అందుకున్న వారికి నిర్ణీత గడువులోగా విచారణ నిర్వహించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,94,399 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 1,94,395 నోటీసులు జనరేట్ అయ్యాయి. వీటిలో...