Thursday, October 22, 2026
Home Health –స్వచ్ఛ సేవకుల ఆరోగ్య పరిరక్షణే జీడబ్ల్యూఎంసీ ధ్యేయం…. –పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాన్ని...

–స్వచ్ఛ సేవకుల ఆరోగ్య పరిరక్షణే జీడబ్ల్యూఎంసీ ధ్యేయం…. –పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కమిషనర్ వెంకన్న—

0
34

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 30:

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు జీడబ్ల్యూఎంసీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం కమిషనర్ టి. వెంకన్న ప్రారంభించారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కంటి పరీక్షలను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వరంగల్ జిల్లా యూపీహెచ్‌సీల వైద్య సిబ్బంది ద్వారా రక్త పరీక్షలు, ఇతర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి హెల్త్‌ కార్డు అందజేసి, వారి ఆరోగ్య వివరాలను అందులో నమోదు చేయనున్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే వైద్య శిబిరాలతో పాటు సమీపంలోని యూపీహెచ్‌సీల ద్వారా కూడా వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు.స్వచ్ఛత హీ సేవలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అవసరమైన పీపీఈ కిట్లను సపాయి మిత్రులకు అందజేశారు. అలాగే ర్యాగ్ పిక్కర్లు, వ్యర్థాల సేకరణలో పాల్గొనే కార్మికులకు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో కమిషనర్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో చురుకుగా పనిచేస్తున్న ఇద్దరు స్వచ్ఛ ఆటో డ్రైవర్లను గుర్తించి కమిషనర్ వెంకన్న సన్మానించారు.ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. నగర పారిశుద్ధ్యానికి వెన్నెముకైన కార్మికుల ఆరోగ్యమే లక్ష్యమని, వారు నగర పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్యం మరియు భద్రతకు జీడబ్ల్యూఎంసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా కార్మికుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సానిటరీ సూపర్‌వైజర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.