Tuesday, October 27, 2026
Home People -సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి – డాక్టర్ అనితా రెడ్డి, ట్రిబ్యునల్...

-సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి – డాక్టర్ అనితా రెడ్డి, ట్రిబ్యునల్ కోర్టు మెంబర్…..

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 27

సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి, హన్మకొండ లోని జిల్లా పరిషత్తు ఆవరణలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను సందర్శించి అందులో వయో వృద్ధులకోసం ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ క్లినిక్ మరియు లీగల్ ఎయిడ్ క్లినిక్ ,లాబ్రెరీ ఎలా నడుస్తుందో పరిశీలించి అడిగి తెలిసికున్నారు సీనియర్ సిటిజన్స్ కోసం లీగల్ సలహాలు, సూచనలు కోసం సంప్రదించడానికి ఎంత మంది వస్తున్నారు ఎన్ని కేసులు నచ్చాయి, సలహాలు, సూచనలకోసం ఎంత మంది వచ్చారు, కౌన్సిలింగ్ కి ఎంత మంది వస్తున్నారు అన్న వివరాలు అడిగి తెలిసికున్నారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ… సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ లో అందిస్తున్న ఉచిత ఫిజియోథెరపీ మరియు ఉచిత న్యాాయ సలహాల కేంద్రాన్ని వినియోగించుకోవాలని అన్నారు, వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు వరం అన్నారు, జిల్లా లోని ట్రిబ్యునల్ కోర్టుకు వస్తున్న కేసులు పని చేస్తూన్న తీరును డాక్టర్ అనితా రెడ్డి వివరించారు , ఇక ముందు కూడా సీనియర్ సిటిజన్స్ కోసం మరింతగా పనిచేయాల్సిన విషయాల గురించి అక్కడ సిబ్బంది తో చర్చించారు, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు ద్వారా వృద్దులకు మరిన్ని సేవలు అందిద్దాం అని, సీనియర్ సిటిజన్స్ చట్టం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దాం అని, అన్నీ డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్సితో వయోవృద్దుల కోసం పని చేద్దాం అని అన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, డాక్టర్ ఉష, ఉమ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.