Saturday, October 24, 2026
Home Politics -పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు … –నూతన చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డి,...

-పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు … –నూతన చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డి, పాలకవర్గానికి ఘన సన్మానం—

0
28

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 

హసన్పర్తి పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్‌ చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డి  తో పాటు నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే  శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ... రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పటికీ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు, పంటల కొనుగోలు తదితర అంశాల్లో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, కుట్రలను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.పీఏసీఎస్‌లు రైతులకు ఆర్థికంగా, వ్యవసాయపరంగా అండగా నిలిచే కీలక సంస్థలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు రుణాలు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు సకాలంలో అందేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు,మల్లారెడ్డిపల్లి పాక్స్ చైర్మన్ కుమార్,జిల్లా,మండల,డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.