-పీఏసీఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు … –నూతన చైర్మన్ పింగళి వెంకటరెడ్డి, పాలకవర్గానికి ఘన సన్మానం—
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 హసన్పర్తి పీఏసీఎస్ సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ చైర్మన్ పింగళి వెంకటరెడ్డి తో పాటు నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ... రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పటికీ...