Saturday, October 24, 2026
Home People –ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్‌.ఐ.ఆర్. ప్రక్రియ నిర్వహించాలి : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల...

–ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్‌.ఐ.ఆర్. ప్రక్రియ నిర్వహించాలి : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి…–ఎస్‌ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశాలపై జిల్లా కలెక్టర్ సత్య శారద  తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ.

0
24

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా  అక్టోబర్ 1 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక 

ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.వరంగల్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లను నోటీసులు అందుకోవడానికి లేదా అవసరమైన పత్రాలు సమర్పించడానికి కార్యాలయాలకు పిలవరాదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలనువారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు.ఇకపై సాధారణంగా ఓటర్లను విచారణ (హియరింగ్) కోసం కార్యాలయాలకు పిలవరాదని సీఈఓ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో విచారణ నిర్వహించాల్సి వస్తే ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

–ఫారం-6 డిక్లరేషన్ తప్పనిసరి—

కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండాలని సీఈఓ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ నిర్వహించని రాష్ట్రాల్లో డిక్లరేషన్ అవసరం లేకపోయినప్పటికీ, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు సందర్భంగా డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.ఈఆర్ఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు.ఓటర్లకు జారీ చేయాల్సిన పెండింగ్ నోటీసులపై కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.ఫారం-6, పెండింగ్ నోటీసులు, ఫారం-7, ఫారం-8కు సంబంధించిన వివరాలను అన్ని స్థాయిల్లోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందించాలని సీఈఓ ఆదేశించారు.ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దశను పారదర్శకంగా పూర్తి చేయాలని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 1,94,395 కి గాను ఇప్పటి వరకు 1,04,181హియరింగ్ చేయగా, ఇంకాను 90,214 పెండింగ్ హియరింగ్ చేయవలసి ఉన్నాయని, వాటిని వారం లోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఎలక్షన్ సూపరిండెంట్ రజిని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.