–ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ నిర్వహించాలి : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి…–ఎస్‌ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశాలపై జిల్లా కలెక్టర్ సత్య శారద తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ.
వరంగల్ జిల్లా అక్టోబర్ 1 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.వరంగల్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లను నోటీసులు అందుకోవడానికి లేదా అవసరమైన పత్రాలు సమర్పించడానికి కార్యాలయాలకు...