పరివర్తన అవాజ్/ఇల్లందు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ నిజాంపేట కోటమైసమ్మ తల్లి ఆలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం అత్యంత వైభవంగా, గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ నూతన కమిటీకి గౌరవ అధ్యక్షురాలిగా గ్రామ ప్రథమ పౌరురాలు, సర్పంచ్ బానోత్ శారద, గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు సూర్ణపాక శోభన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఆలయ కమిటీ అధ్యక్షుడిగా వర్స బద్రం, కోశాధికారిగా పత్తి హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు.కమిటీ సభ్యులుగా సూర్నపాక కోటేశ్వరరావు, పోటు రవి, వర్స రామనాథం, ఇమ్మడి పుల్లయ్య, చుక్క నాగరాజు, గంగారపు ఉప్పలయ్య, బానోత్ భద్రు, పత్తి ఉప్పలయ్య, దొంతు లక్ష్మయ్య, అమడగాని భిక్షం, అమడగాని ఉపేందర్, రచ్చ నాగేశ్వరరావు, రచ్చ జ్యోతిబాబు, గాజుల వెంకన్న, గంగారపు వెంకటేశ్వర్లు, గంగారపు కోటేశ్వరరావు, గంగారపు చిన్న వెంకటేశ్వర్లు, బర్ల వీరన్న, బానోత్ లచ్చిరాం, బానోత్ లాలు, జర్పుల సందీప్, కుంజ సందీప్, వర్స రామకృష్ణ, వర్స పాండురంగారావు, వర్స రాజు, వర్స రమేష్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన పాలకవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ… నిజాంపేట కోటమైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి, భక్తులకు మౌలిక వసతుల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని, గ్రామస్తులందరి సహకారంతో రాబోయే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏకగ్రీవ ఎన్నిక పట్ల గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.




