నిజాంపేట కోటమైసమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
పరివర్తన అవాజ్/ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ నిజాంపేట కోటమైసమ్మ తల్లి ఆలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం అత్యంత వైభవంగా, గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ నూతన కమిటీకి గౌరవ అధ్యక్షురాలిగా గ్రామ ప్రథమ పౌరురాలు, సర్పంచ్ బానోత్ శారద, గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు సూర్ణపాక శోభన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఆలయ కమిటీ అధ్యక్షుడిగా వర్స బద్రం, కోశాధికారిగా పత్తి హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు.కమిటీ సభ్యులుగా సూర్నపాక కోటేశ్వరరావు, పోటు రవి, వర్స రామనాథం,...