Thursday, October 22, 2026
Home People –కేరళ తాంత్రిక ఆచార్యన్ బ్రహ్మశ్రీ డాక్టర్ కె ప్రదీప్ కుమార్ తంత్రి ఆధ్వర్యంలో వరంగల్ లో...

–కేరళ తాంత్రిక ఆచార్యన్ బ్రహ్మశ్రీ డాక్టర్ కె ప్రదీప్ కుమార్ తంత్రి ఆధ్వర్యంలో వరంగల్ లో అయ్యప్ప పూజా విధానం శిక్షణ తరగతులు…. –కేరళ సాంప్రదాయ ప్రకారం శిక్షణ తరగతులు… –మహాశాస్త్ర తంత్ర పీఠం శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ కుసుమ ప్రదీప్ కుమార్ తంత్రి…

0
16

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7

ఉమ్మడి వరంగల్ జిల్లా అయ్యప్ప భక్తులకు మరియు గురు స్వాములకు ప్రజలకు మహాశాస్త్ర తంత్ర పీఠం వరంగల్ లోని స్టేషన్ రోడ్ లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ మొదట హైదరాబాదులో రెండవ మన వరంగల్ లోని స్టేషన్ రోడ్ లో ఏర్పాటు చేశారు. మహాశాస్త్ర తంత్ర పీఠం శ్రీ బ్రహ్మ శ్రీ డాక్టర్ కుసుమ ప్రదీప్ కుమార్ తంత్రీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి సమాజానికి అయ్యప్ప స్వామి యొక్క పూజా విధానాన్ని కేరళ సాంప్రదాయ ప్రకారం గురు స్వాములకు అయ్యప్ప భక్తులకు కులమత భేదాలు లేకుండా లింగ బేధం లేకుండా జ్ఞానాన్ని ప్రసాదించాలని సంకల్పంతో మహా శాస్త్ర తంత్ర పీఠం ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది… ఈ సందర్భంగా మహా శాస్త్ర తంత్రపీఠం శ్రీ బ్రహ్మ శ్రీ డాక్టర్ కుసుమ ప్రదీప్ కుమార్ తంత్రి మాట్లాడుతూ…. మన వరంగల్ లోని స్టేషన్ రోడ్ లో తంత్ర పీఠం గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తు ప్రతి బుదవారం తరగతులు మన వరంగల్లో అంతేకాకుండా జనవరి నుండి ఈ యొక్క శిక్షణ తరగతుల ని మూడు విభజనలుగా అంటే మొదటిది ఆన్లైన్ తరగతులు రెండవది ప్రతి ఆదివారం మూడు గురుకులం లాగా శిక్షణ తరగతులు చెప్పడం జరుగుతుంది. అదేవిదంగా ఈ యొక్క సెంట్రల్ ఆఫీస్ హైద్రాబాద్ ఘట్కేసర్, రెండో బ్రాంచ్ మన వరంగల్లో ప్రారంభం ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది.. . ప్రతి సంవత్సరం మొదటి విడత అడ్మిషన్లు జనవరి నెలలో.. రెండో విడత అడ్మిషన్లు జూన్లో జరుగుతుంది ఈ యొక్క సదా అవకాశాన్ని వరంగల్ ట్రై సిటీ లోని అయ్యప్ప భక్తులు గురు స్వాములు ప్రతి ఒక్కరు కూడా కులమతాలకతీతంగా వినియోగించుకోవాలని మహాశాస్త్ర తంత్ర పీఠం శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ కుసుమ ప్రదీప్ కుమార్ తంత్రి గురు స్వామి డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో గురు స్వాములు పోలా ఉమామహేశ్వర్, రాచర్ల రాజు, వెల్దండి ఓంకార్, వేముల రంజిత్, హనుమంతరావు, ఉంగరాల వెంకన్న, కోరే వెంకటస్వామి, వేయి కండ్ల జితేందర్ గురుస్వామి, చెవ్వ సంపత్ కుమార్, సుంకేనపల్లి శ్రీనివాస్, గంధసిరి రమేష్, ఆడేపు రఘు, తదితర గురు స్వాములు అయ్యప్ప స్వామి భక్త బృందం పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.