పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నక్కలగుట్ట నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ గార్డెన్ ను గురువారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు శ్రీ విష్ణు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి,కస్టమర్లకు అందుబాటు ధరలలో నాణ్యమైన బహుమతులను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి,స్థానిక డివిజన్ అధ్యక్షులు కరీం,నాయకులు కొండా నాగరాజు ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




