పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9…శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేశం లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు అని పేర్కొన్నారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలని బీ ఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్నది అని తెలిపారు.స్వంతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఒక పార్టీ కి ఊడిగం చేస్తోంది అని 14 సార్లు సీ ఈ సీ నిర్ణయాల తో సహా కమిషనర్లు విభేదించారు అని తెలియజేసారు.సీ ఈ సీ ఓ ప్రైవేటు సంస్ధ ను పెట్టుకుని ఓట్లను విచ్చలవిడిగా తొలగించారు అని కండించారు .దీని బట్టే సీఈసీ పని తీరు ఎంత పేలవమో తెలుస్తోంది,తొలగించిన ఓటర్లు తర్వాత అర్హతలు చూపించినా తిరిగి జాబితా లో చేర్చకపోవడం ఏమిటీ అని ప్రశ్నించారు.రోగికి డాక్టరే విషమిచ్చి చంపినట్టు సీఈసీ దేశ పౌరులను ఓట్లకు దూరం చేశారు అని మండిపడ్డారు.జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని,తొలగించిన ఓటర్ల పై సమగ్ర విచారణ చేపట్టాలని,ఫారం 7 పేరిట చేస్తున్న దరఖాస్తుల పై విచారణ జరగాలని,ఈ వీ ఎం ల పై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని వారు మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేశారు.ఈ సమావేశం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ,ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




