Thursday, October 22, 2026
Home Politics తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

0
26

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27

1991 నుంచి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాళోజీ తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్ది అజయ్ కుమార్, వరంగల్ జిల్లా జేఏసీ అధ్యక్షులు గురుమూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం దశాబ్దాలుగా వివిధ దశల్లో ఉద్యమాలు చేసిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన న్యాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యమకారుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్ కురపాటి వెంకటనారాయణ,కాళోజి తెలంగాణ జూనియర్ లేడి అడ్వాకేట్ రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ది రాగిణి రాజ్,ఉద్యమకారులు వంగల సదానందం, మల్లికార్జున, కొమురయ్య , రవి, మునిందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.