Author: parivarthanaawaaz
శేరిలింగంపల్లి లో అసంపూర్తిగా పనులు, కొనసాగిస్తున్నారు నత్తనడకన మంజీరా పైప్ లైన్ పనులు నిరుపయోగంగా మరీనా కూరగాయల మార్కెట్ శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణుల నిరసన శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 21 శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న మంజీర పైప్‌లైన్ రోడ్డు పనులు, కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ వ్యవహారంపై బీజేపీ నాయకులు శుక్రవారం నాడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ కంటస్టెడ్ ఎమ్మెల్యే శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, మంజీర రోడ్డు పనుల ఆలస్యం వల్ల ప్రజలు నిత్యం తీవ్ర…
ప్రజా పోరాటాలతో పునీతమైన ఎర్రజెండ. Cpi జాతీయ నాయకులు మాజి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 మహబూబాబాద్ , సిపిఐ 100 సంవత్సరాల ప్రచార బస్సుజాతకు సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. గార్ల పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం గార్ల నెహ్రూ సెంటర్లో నిర్వహించిన ప్రచార సభలో సిపిఐ జాతీయ నాయకులు మాజి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా పోరాటాలతో ఎర్రజెండా పునీతమైందని వంద ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘన చరిత్ర సిపిఐ పార్టీది అని అన్నారు.సిపిఐ 100వ వార్షికోత్సవాల ప్రచార జాత ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత 100 సంవత్సరాలుగా భారత దేశంలో జరిగిన…
నూతన ఖాతాదారుల సేవా కేంద్రం ప్రారంభం… పరివర్తన అవాస్ న్యూస్ గార్ల: గార్ల శుక్రవారం రోజు పేపాయింట్ బిజినెస్ కరస్పాండెంట్ ఆధ్వర్యంలో నూతనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సేవ కేంద్రం బ్రాంచ్ మేనేజర్ భవాని శంకర్ పేపాయింట్ మేనేజర్ పూనెం మనోజ్. చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఖాతాదారుల సేవ కేంద్రం ప్రారంభించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ కస్టమర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఖాతాదారులు 30 వేల వరకు జమ చేసుకోవచ్చు ఉపసంహరణ చేసుకోవచ్చని మహిళా సంఘాల లోను సంబంధించిన లావాదేవీలు జరుపుకోవచ్చునని అలాగే పే పాయింట్ మేనేజర్ పూనెం. మనోజ్ మాట్లాడుతూ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పథకాలు గురించి ఖాతాదారులకు వివరించి. అలాగే ఈ యొక్క ప్రమాద బీమా ప్రతి ఒక్క ఖాతాదారు తీసుకోవాలని ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది అలాగే గ్రామ పెద్దలు, మహిళా సంఘాల…
ఘనంగా నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు రాజేంద్రనగర్ పరివర్తన అవాజ్ నవంబర్ 21, రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కోకపేట లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలం లో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్థుల కోసం కేటాయించిన స్థలం లో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపటం ఆనందంగా ఉందని తెలియచేశారు. వచ్చే సంవత్సరం ఈ వేడుకలు ఆత్మగౌరవ భవనం లో జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం…
కామారెడ్డిలో ఈ నెల 27, 28న కవిత జాగృతి జనం బాట పర్యటన కామారెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 , ఈ నెల 27, 28 తేదీల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. 27న నిజాంసాగర్, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను కవిత స్వయంగా తెలుసుకోనున్నారు. 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుంది. జనం బాట కార్యక్రమాన్ని ప్రజలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా జాగృతి నాయకులు, యూత్ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు
హైడ్రా అరాచకాలను తరిమికొట్టాలి హిందూ దేవాలయాల జోలికొస్తే సహించేది లేదు… శేరిలింగంపల్లి బీజేపీ కంటస్టెడ్ ఎంఎల్ఏ రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 21 ,శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ సున్నం చెరువులోనీ హనుమాన్ ఆలయాన్ని తొలగించేందుకు హైడ్రా అధికారుల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ స్వామి వారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టిన బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ గత 20 సంవత్సరాలుగా మాధాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు వద్ద ఉన్న పురాతన హనుమాన్ దేవాలయాన్ని హైడ్రా అధికారులు తొలిగించాలని చూడగ బీజేపి ఆధ్వర్యంలో వి.హెచ్.పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని అడ్డుకోవడం జరిగింది, ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు తదనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ…
ఎమ్మెల్యే కావడమే తన లక్ష్యం కంటారెడ్డి తిరుపతిరెడ్డి లక్ష రూపాయల తో నీటి శుద్ధి ప్లాంట్ కేంద్రాన్ని ప్రారంభించిన తిరుపతిరెడ్డి రామాయంపేట పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 , ఎమ్మెల్యే కావడం తన లక్ష్యమని లక్ష్య సాధన కోసం నిర్విరామ కృషితో పాటు, పేదల అభ్యున్నతికి పాటు పడతానని BRS పార్టీ మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కo టారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం బిఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కంట రెడ్డి తిరుపతిరెడ్డి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సంకల్పంతో తన సొంత ఖర్చులతో సుమారు లక్ష రూపాయలు…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణానను తక్షణమే నిలిపివేయాలి. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 21, మెదక్ నియోజవర్గంలో వివిధ ప్రాంతాల నుండి మరియు మెదక్ మండలం సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి గత నెల రోజులుగా రాత్రిపగలు హిటాచి సహాయంతో టిప్పర్ల ద్వారా హైదరాబాదు, జహీరాబాద్,బీదర్ నగరాలకు ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు,వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి ,మెదక్ పట్టణ , మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూఅధికార పార్టీ నాయకుల అండదండలతో మెదక్ ప్రాంతం నుండి హైదరాబాద్, జహీరాబాద్ బీదర్ నగరాలకు సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి…
అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాపారులకు అవగాహన పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు : ఇల్లందు పట్టణంలోని 17, 18 వార్డుల పరిధిలో ఆర్యవైశ్య మహాసభ, అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నెహ్రూ చౌక్ కూరగాయల మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు డి.ఎస్.పి చంద్ర భాను హాజరై వ్యాపారులు, స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాల సందర్భంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, జాగ్రత్తలపై బేసిక్ శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎప్పు డు, ఎక్కడ, ఎలా సంభవిస్తాయో ఊహించడం కష్టమని, కానీ ముందస్తు జాగ్రత్తలు, సురక్షిత చర్యలతో ప్రాణ నష్టం,ఆస్తి నష్టాన్ని తప్పించుకోవచ్చని సూచించారు. ప్రతి వ్యాపార స్థావరంలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా ఉంచుకోవాలని, అవి పని చేస్తున్నాయో లేదో సమయానుకూలంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన సందర్భంలో వెంటనే అంబులెన్స్, ఫైర్,…
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం . పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి. మెదక్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 21, మెదక్ పట్టణంలోని ద్వారకా నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులు సభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రభు రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.