Author: parivarthanaawaaz

అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణానను తక్షణమే నిలిపివేయాలి. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 21,  మెదక్ నియోజవర్గంలో వివిధ ప్రాంతాల నుండి మరియు మెదక్ మండలం సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి గత నెల రోజులుగా రాత్రిపగలు హిటాచి సహాయంతో టిప్పర్ల ద్వారా హైదరాబాదు, జహీరాబాద్,బీదర్ నగరాలకు ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు,వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి ,మెదక్ పట్టణ , మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూఅధికార పార్టీ నాయకుల అండదండలతో మెదక్ ప్రాంతం నుండి హైదరాబాద్, జహీరాబాద్ బీదర్ నగరాలకు సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి…

Read More

అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాపారులకు అవగాహన పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు : ఇల్లందు పట్టణంలోని 17, 18 వార్డుల పరిధిలో ఆర్యవైశ్య మహాసభ, అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నెహ్రూ చౌక్ కూరగాయల మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు డి.ఎస్.పి చంద్ర భాను హాజరై వ్యాపారులు, స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాల సందర్భంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, జాగ్రత్తలపై బేసిక్ శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎప్పు డు, ఎక్కడ, ఎలా సంభవిస్తాయో ఊహించడం కష్టమని, కానీ ముందస్తు జాగ్రత్తలు, సురక్షిత చర్యలతో ప్రాణ నష్టం,ఆస్తి నష్టాన్ని తప్పించుకోవచ్చని సూచించారు. ప్రతి వ్యాపార స్థావరంలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా ఉంచుకోవాలని, అవి పని చేస్తున్నాయో లేదో సమయానుకూలంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన సందర్భంలో వెంటనే అంబులెన్స్, ఫైర్,…

Read More

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం .                పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి. మెదక్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 21, మెదక్ పట్టణంలోని ద్వారకా నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులు సభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రభు రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్…

Read More

  గోపాల్ పేట్‌లో లంచం వ్యవహారం… విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీ వలకు (పరివర్తన అవాజ్ ) నవంబర్ 18,  గోపాల్ పేట్‌లో అవినీతి పై ఏసీబీ ముళ్లవల బిగించిందీ… విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ప్రజలకు సేవ చేయాల్సిన పదవిని వ్యక్తిగత లాభాలకు వాడుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏసీబీ ఆధ్వర్యంలో జరిగిన అకస్మిక దాడిలో ఆయనను రంగేహస్తాలుగా అరెస్టు చేశారు

Read More

      బస్సును ఢీకొని యువకుడు మృతి కామారెడ్డి పరివర్తన అవాజ్ ఇల్లందు నవంబర్ 17:  కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు కామారెడ్డి నుండి పిట్లం వైపు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో హాజీపూర్ గ్రామంలో ఓ ప్రయాణికుడిని దింపేందుకు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా బస్సు ఆగింది. ఈ సందర్భంగా వెనుక నుండి వస్తున్న ఫిర్యాదుదారుని తమ్ముడు మాదిగ కాశీరాం (32 సంవత్సరాలు), మంబాజీపేట గ్రామం, లింగంపేట మండలం చెందినవ్యక్తి తన మోటార్‌సైకిల్‌తో బస్సును ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై మృతుని అన్న కాశీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.

Read More

  కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కొడిప్యాక సాయిరాం  ఏకగ్రీవంగా నియామకం అయ్యారు.నియామకం జరిగిన అనంతరం సాయిరాం విలేకరులతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు  తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఈ పదవికి న్యాయం చేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని సాయిరాం తెలియజేసారు.తన నియామకానికి సహకరించిన డాక్టర్ చంటి ముదిరాజ్  శ్రీమతి సూర స్రవంతి  మల్లం వెంకటేశం  మరియు వీరమల్ల రమశ్రీ  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Read More

కోండాపూర్‌లో విషాదం…నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి కింద పడిన కార్మికులు ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు అక్రమ నిర్మాణం అజాగ్రత్త నిర్లక్ష్యం వహించడం వల్లే అమాయకుడి ప్రాణాలు బలి అంటున్న స్థానికులు శేరిలింగంపల్లి సర్కిల్ 20 వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యానికి అక్రమ నిర్మాణ దారుల ధన దాహానికి బలవుతున్న అమాయకులు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 15  గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కోండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదం వల్ల ఇద్దరు కార్మికుల కుటుంబాలను చీకటిలోకి నెట్టింది. సుమారు మూడు గంటల సమయంలో నాల్గవ అంతస్తులో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు గోవ కర్రలను కడుతున్న సమయంలో ఒక్కసారిగా కర్రలు విరగడంతో వారు నాలుగవ అంతస్తునుండి కిందకు పడిపోయారు. అయితే వెంటనే స్థానికంగా ఉండేవారు వీరిని గమనించి వెంటనే స్థానిక కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ…

Read More

విద్యార్థుల హక్కుల పరిరక్షనే ప్రధాన లక్ష్యం ..జాతీయ మానవ హక్కుల కమిషన్ .. శివ శంకర్ దుబ్బాక ( పరివర్తన అవాజ్ ): దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో జాతీయ మానవ హక్కుల సంస్థ దుబ్బాక మండల అధ్యక్షులు పున్న శివశంకర్ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల మరియు యుపిఎస్ ప్రాథమిక పాఠశాల లో ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. విధ్యార్తులకు మధ్యాహ్న భోజనం పథకంలోనీ ఆహారాలు తనిఖీ చేయడం జరిగింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన మెనూ ఆధారంగా భోజనాన్ని అందించాలని సూచించడం జరిగింది. విద్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలపడం జరిగింది. విద్యార్థుల ప్రాథమిక హక్కులను వారికి చెప్పడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న జాతీయ మానవ హక్కుల సంస్థ ద్వారా వారికి సహాయం అందుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి తనిఖీ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సహకరించడం జరిగింది .

Read More

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు? తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి.. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది, పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి, ఓవైపు మొంథా తుఫాన్ మరోవైపు కార్తీకమాసం నేపథ్యంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..దీంతో వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.సాధారణంగా సీజన్ మారినప్పుడు కొంతమేర ధరల్లో మార్పులు ఉంటాయి కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు, వరంగల్, వంటి నగరాల్లోనే కాకుండా గ్రామీణమార్కెట్లలోకూడా కూరగాయల ధరలు మండుతున్నాయి.చాలా రకాల కూరగాయలు పావుకేజీకి రూ.30–35 కంటే తక్కువకు దొరకడం లేదు, అంటే కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా చిక్కుడు పూల గోబి, క్యారెట్, టమాటో దోసకాయ, బీరకాయ, మిరపకాయ, వంకాయ వంటి సాధారణ కూరగాయలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి .ఇటీవల మొంథా తుఫాను కారణంగా…

Read More

తెలంగాణలో పెరిగిన చలి అవాజ్ న్యూస్ నవంబర్, 13 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ యూ,లో బుధవారం రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలో సగటున 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణో గ్రతలు పడిపోయాయని తెలిపారు. ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు ఈరోజు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం,…

Read More