Author: parivarthanaawaaz
ప్రజావాణి లో 80 దరఖాస్తులు ప్రజావాణి లో వస్తున్న అర్జీలకు అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలి: జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్10 : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ , డిప్యూటి కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ లు కామారెడ్డి వీణ, , ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత ఆయా శాఖ జిల్లా ఆధికారులకు అర్జీలను ఇస్తూ…
పలు కాలనీలు సైకిల్ పై సందర్శించిన టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 8 మహబూబాబాద్, స్థానిక పట్టణ కేంద్రంలో ఉదయం 5 గంటల నుండి నందమూరి నగర్, తీగల సత్యనారాయణ కాలనీ, జగన్ కాలనీ, సిగ్నల్ కాలనీ, ధర్మన్న కాలనీ, స్థానిక సీఐ ఉదయం నుండి ప్రజలతో మమేకమై కాలనీలో ఉండే సమస్య లను ఆరా తీస్తూ సైబర్, వెహికల్ దొంగలు ఉదయం పూట మహిళలు ఊడ్చే సమయంలో, మెడలో పుస్తెలతాడులు తెంపుకొని వెళుతున్నారు, కాబట్టి మహిళలకు తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేస్తూ, కొన్ని చోట్లలో నందమూరి నగర్, ధర్మన్న కాలనీలో, కాలనీవాసులతో మాట్లాడి త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రజల సహకారం ఉంటే తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిఐ అన్నారు.
పెండింగ్ ఫీజు బకాయిలు వచ్చేవరకు ఉద్యమిస్తాం విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కామారెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 07: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.లక్షలాదిమంది విద్యార్థులకు సంబంధించిన ఫీజుబకాయలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు యాజమాన్యాలు విద్యార్థులు గురవుతున్నారని, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కళాశాల యాజమాన్యాలు బంద్ ను నిర్వహిస్తున్నాయని,నేటితో నాలుగో రోజుకు చేరుకోవడం జరిగిందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న పూర్తి బకాయాలను చెల్లించి న్యాయం చేయాలని అన్నారు. పెండింగ్ ఫీజు బకాయలు వచ్చేవరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరంతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్…
ఆరు గ్రామపంచాయతీల రైతు సమన్వయ కమిటీ చారిత్రక నిర్ణయాలు: రైతులకు ఆర్థిక ఊరట! పరివర్తన అవాజ్ చల్లసముద్రం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఉమ్మడి చల్లసముద్రం మరియు మామిడి గుండాల గ్రామపంచాయతీలలోని ఆరు గ్రామపంచాయతీల రైతు సమన్వయ కమిటీ రైతుల సంక్షేమం కోసం కీలక, చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఎంతో కాలంగా వ్యాపారస్తులు(ధాన్యం కొనుగోలుదారులు) బస్తాకు తీసుకుంటున్న 72 కేజీల బరువును 71 కేజీలుగా నిర్ణయించడం జరిగింది, హమాలీ కూలీల విషయంలోనూ రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. గతంలో క్వింటాల్‌కు రూ. 85 తీసుకున్న ఛార్జీని రూ. 75 కు నిర్ణయించారు(రైతు కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే).వ్యాపారస్తుల (స్థానిక కొనుగోలుదారుల )వద్ద పాత ధర వర్తిస్తుంది. దీనితో పాటు, అన్ని పంటలపై ‘బిక్షం’ పేరుతో గతంలో వసూలు చేసిన 20 నుంచి 30 కేజీల అదనపు ధాన్యాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కమిటీ తీసుకున్న ఈ రైతు అనుకూల…
ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ నవంబర్, 03 భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల వారిచే 3/11/2025న సంస్థలో ర్యాగింగ్ రహిత వాతావరణాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ర్యాగింగ్ యొక్క ప్రతికూల ప్రభావం మరియు అటువంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కలిగే పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు అతిథి వక్తలు ప్రసంగించారు, వారు ర్యాగింగ్ పట్ల సంస్థ యొక్క జీరో-టాలరెన్స్ విధానాన్ని హైలైట్ చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టం మరియు చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షల గురించి విద్యార్థులకు సమాచారం అందించారు. గౌరవం, గౌరవం మరియు స్నేహపూర్వకత సూత్రాలను నిలబెట్టడానికి మరియు ర్యాగింగ్ యొక్క ఏవైనా సంఘటనలను అధికారులకు నివేదించడానికి విద్యార్థి ప్రతినిధులు ప్రమాణం చేశారు. ర్యాగింగ్…
పాల్వంచలో పెరిగిన అక్రమ ఇసుక రవాణా – ఉదాసీనంగా అధికారులు, స్థానికుల్లో భయాందోళన పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్, సరిహద్దు ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ముర్రేడు వాగు నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా దర్జాగా జరుగుతున్న ఈ ఇసుక దందా వెనుక రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలను, తీవ్ర ఆరోపణలను రేకెత్తిస్తోంది.అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు చిన్న రోడ్లలో సైతం అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు డ్రైవర్లు సెల్‌ఫోన్‌ల ను చెవి వద్ద పెట్టు కుని తమ యజమానులకు అప్‌డేట్‌లు ఇస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండటం మరింత ప్రమాదకరం.చాలామంది డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రాక్టర్లకు కనీసం చెల్లుబాటు అయ్యే పత్రాలు (కాగితాలు) లేకపోవడం నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందో…
నేచురల్ జ్యూస్ స్టాల్ ప్రారంభించిన డిఎస్‌పి నరేందర్ గౌడ పరివర్తన ఆవాస్ అక్టోబర్ 31 రామాయంపేట పట్టణంలో, స్థానిక బస్టాండ్ ఎదురుగా శ్రీ సాయి మెడికల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్ జ్యూస్ స్టాల్ ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై బాలరాజు గౌరవ అతిథులుగా హాజరై స్టాల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ఉదయం వ్యాయామం చేసిన తరువాత ఇలాంటి నాచురల్ జ్యూస్‌లను తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని తెలిపారు. రామాయంపేటలో ఇలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్ స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.స్టాల్ నిర్వాహకుడిని అభినందిస్తూ మాట్లాడిన సీఐ వెంకట రాజా గౌడ్, పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.…
మెదక్ డివిజన్ ట్రాన్స్కో డి ఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు 21 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డి ఈ షేక్ చాంద్ షరీఫ్ పాషా మెదక్ పరివర్తన అవాజ్ అక్టోబర్ 30 ఓ రైతు వద్ద నుండి 50,000 డిమాండ్ చేయగా రైతు 9000 ఫోన్పే ద్వారా మిగతా 20,000 ఈరోజు డీ .ఈ ఇస్తుండగా రెడ్ హ్యాంగ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఒక రైతు తన పొలం వద్ద కోటిఫాం ఏర్పాటు కొరకు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కావాలని డి ఈ ని అడిగా గా 50,000 ఇస్తేనే ట్రాన్స్ఫారం శాంక్షన్ చేస్తానని డి .ఈ షరీఫ్ పాషా చెప్పగా అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించి రెండు రోజుల కిందట 9వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఈరోజు 21000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు డి ఈ షేక్…
భారీగా తగ్గిన బంగారం ధరలు పరివర్తన అవాజ్ అక్టోబర్ 30 2025, భారీగా తగ్గిన బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,10,450కి పడిపోయింది. వెండి ధర కూడా రూ.1000 తగ్గి కిలో రూ.1,65,000గా ఉంది. ఈ ధరల తగ్గుదల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే విధంగా ఉంది.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటన పరివర్తన ఆవాజ్ పెనుబల్లి: మొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.